Villagers Demand for Liquor Shop: చాలా రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం కోసం ధర్నాలు, రాస్తా రోకోలు చేయడం మనం చూశాం. మద్యం షాపుల వద్ద మహిళల ఆందోళనలు చూశాం. స్కూల్ సమీపంలో మద్యం షాపులు పెట్టారు, గుడికి దగ్గర మద్యం షాపులు పెట్టారు వాటిని తొలగించాలి అంటూ ఆందోళనలు చేయడం కూడా చూశాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ తెలంగాణ రాష్ట్రం ముగులు జిల్లాలో మాత్రం మాకు వైన్ షాపులు కావాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతి గ్రామాల్లో కూడా మద్యం షాపులు ఉన్నాయి. మాకు ఎందుకు ఉండకూడదు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డు ఎక్కారు. రెండు గ్రామాల ప్రజలు కూడా మాకు వైన్ షాప్‌ లు కావాలంటూ ఆందోళన చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత రెండు వారాలుగా ములుగు జిల్లా వర్షాలతో భారీ వరదలు రావడంతో వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. ములుగు జిల్లా మొత్తం వర్షాలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. ఆ వరద బురద ఇంకా పోక ముందే మంగపేట మండలంలోని మల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల్లో మద్యం షాపులు కావాలి అంటూ ఆందోళనలు చేయడం జరిగింది. 


ఈ రెండు గ్రామాల్లో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి అందులో తీర్మానం చేయడం జరిగింది. గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటుకు గ్రామ సభ ఆమోదం తెలిపిన తర్వాత కూడా అధికారులు ముందుకు రాకపోవడం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మద్యం షాపులు లేని కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.


Also Read: Amazon Freedom Sale 2023: OnePlus స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్‌..మొబైల్‌ కొనాలనుకుంటే ఇప్పుడే మంచి ఛాన్స్‌ 


గత ఐదు సంవత్సరాలుగా ఆ రెండు గ్రామాల్లో మద్యం షాపులు లేవు. హైకోర్టు స్టే విధించిన కారణంగా అక్కడ మద్యం టెండర్లకు అవకాశం ఇవ్వడం లేదు. కోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు అక్కడ మద్య పాన నిషేదంను అమలు చేస్తూ ఉన్నారు. కానీ గ్రామస్తులు మాత్రం మద్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి అంటూ తమకు మద్యం షాపులకు అనుమతి ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. 


ఇప్పటికే పలు సార్లు ప్రజా ప్రతినిధులు ఇంకా అధికారులను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మద్యం షాపుల కోసం దరకాస్తులు స్వీకరించేందుకు సిద్దం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈసారి తమ గ్రామాల్లో కూడా మద్యం షాపులకు అనుమతి ఇవ్వాలని.. టెండర్ లకు మా గ్రామాల్లో కూడా ఛాన్స్ ఇవ్వాలంటూ వారు రోడ్లు పైకి ఎక్కారు. మరి అధికారులు.. ప్రజా ప్రతినిధులు వారి మందు గొడవ పట్టించుకుంటారా లేదంటే కోర్టు స్టే అంటూ పట్టించుకోకుండా ఉంటారా అనేది చూడాలి.


Also Read: BSNL Recharge Offers: బీఎస్ఎన్‌ లేటెస్ట్ ఆఫర్.. రూ.321 ప్లాన్‌తో 365 రోజుల పాటు ఫ్రీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి